షియోమీ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది.. Xiaomi 12 Pro 5G ఇండియాలో ఈ నెల 27న విడుదల చేయనున్నారు. చైనాలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు ఇండియాకు రావడంతో.. షియోమీ లవర్స్ కు ఇది శుభవార్తే.. ఇంకెందుకు ఆలస్యం..ధర, స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దామా..!
భారత్‌లో Xiaomi 12 Pro 5G ధర( అంచనా):
షియోమీ 12 ప్రో 5జీ మొబైల్ ప్రారంభ ధర భారత్‌లో సుమారు రూ.65,000 ఉండొచ్చని అంచనా.
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర చైనాలో 4,699 యువాన్లు (సుమారు రూ.56,200)గా ఉంది.
ప్రధానంగా వన్‌ప్లస్ 10 ప్రో 5జీ మొబైల్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
Xiaomi 12 Pro 5G స్పెసిఫికేషన్లు :
6.73 ఇంచుల WQHD+ Samsung E5 AMOLED డిస్‌ప్లేతో షియోమీ 12 ప్రో వస్తోంది.
120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
క్వాల్‌కామ్ లేటెస్ట్ ప్రాసెసర్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది.
గరిష్ఠంగా 12జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13తో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది.
ఇక కెమేరా విషయానిక వస్తే.. Xiaomi 12 Pro 5G వెనుక 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలు ఉంటాయి. 50MP Sony IMX707 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ షూటర్, 50MP పోట్రయిట్ సెన్సార్‌తో ఈ మొబైల్ వస్తోంది. అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను షియోమీ పొందుపరిచింది.
5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ-సీతో పాటు ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
Xiaomi 12 Pro 5Gలో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 10వాట్ల వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది.