ఇలాంటి వారి కోసం త్యాగాలు చెయ్యక్కర్లేదు.. తొందరగా బాయ్ చెప్పేయడమే మంచిది..!

-

అయ్యో మన స్నేహితులే కదా అని మనం వాళ్ల కోసం ఎంత గానో ఆలోచిస్తూ ఉంటాము. వాళ్లకోసం మనం ఎంత గానో ఆలోచిస్తూ ఉంటాము. అయితే నిజానికి మనుషులందరూ ఒకలాగ ఉండరు. కొంత మంది ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం వాళ్లకి కావాల్సినవి ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం సెల్ఫిష్ గా ఉంటారు.

 

ఇతరుల్ని వాళ్ళు పట్టించుకోరు పైగా ఇతరులు బాగుపడకూడదని వాళ్ళు కోరుకుంటుంటారు. ఇతరులకి వచ్చే అవకాశాలను కూడా దూరం చేయాలని చూస్తూ ఉంటారు. మన చుట్టూ ఉండే వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు అయితే ప్రతి ఒక్కరి కోసం మనం త్యాగాలు చేసేయక్కర్లేదు ఇతరులు బాగుపడకూడదని కోరుకునేవారు ఇతరులకు వచ్చే అవకాశాలు దూరం చేసే వారు మీ చుట్టూ ఉంటే మీరు వాళ్ల కోసం ఏ మాత్రం ఆలోచించక్కర్లేదు.

వెంటనే వీలైనంత త్వరగా వాళ్లకి బాయ్ చెప్పాడమే మంచిది. వీలైనంత త్వరగా అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే నిరాశా స్పృహాలకు మాత్రమే గురి చేస్తారని గుర్తు పెట్టుకోండి వాళ్ల వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు అని తెలుసుకోండి. మీతో వారు ఉంటే నష్టాలు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించండి.

అటువంటి వ్యక్తులతో మాట్లాడడం వాళ్ళతో సమయాన్ని గడపడం ఏ మాత్రం మంచిది కాదు ఇటువంటి వ్యక్తుల వలన మీకే సమస్య తప్ప ఏ మాత్రము ఉపయోగం లేదు. మిమ్మల్ని ప్రోత్సహించే వారు… మీ బాధలని పంచుకోవడానికి ఒకరు ఉంటే సరిపోతుంది ఇలాంటివి వాళ్ళు ఎంత మంది ఉన్నా వారి వల్ల నష్టమే తప్ప ఏ ప్రయోజనం లేదు మంచి వాళ్లు బెస్ట్ వాళ్ళు మీతో ఒక్కరు వున్నా సరిపోతుంది.

చెడుగా ఆలోచించే వాళ్లు మీ అవకాశాలు దూరం చేయాలనుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నా సరే అది మీకు నష్టమే కాబట్టి అటువంటి వాళ్ళకి సైడ్ ఇచ్చి మీ జీవితంలో నుంచి దూరంగా పంపించేయండి. మీతో ఉండాలనుకునే వారు.. మీ బాగుకోరుకునే వారు ఎల్లప్పుడూ మీ పక్కనే వుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news