నేను ఆడియన్స్ ని తప్ప ఎవరిని మోసం చేయలేదు – పూరి జగన్నాథ్

-

డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియాకి ఓ లేఖని రిలీజ్ చేశారు. తాను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది తనని నమ్మి తన సినిమా టికెట్ కొన్న ఆడియోస్ని తప్ప వేరే ఎవరిని మోసం చేయలేదని అన్నారు. అంతేకాక లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు పూరి జగన్నాథ్.

“మళ్ళీ ఇంకో సినిమా తీస్తా.. వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి. ఇక్కడ ఏదీ పర్మినెంట్ కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్పీరియన్స్ లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదు”… అంటు లేఖ విడుదల చేశారు పూరి జగన్నాథ్. ఇంతకీ ఆ లేక పూర్తి సారాంశం ఏమిటంటే.. SUCCESS AND FAILURE, ఈ రెండూ OPPOSITE అనుకుంటాం, కాదు. ఈ రెండూ FLOW లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి.

గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక NEXT జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే.. ఇక్కడ ఏదీ PERMANENT కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక EXPERIENCE లా చూడాలి తప్ప, FAILURE SUCCESS లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి.

అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, SHOW అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. SUCCESS ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తుంది. SO ఎప్పుడూ మనం MENTALLY, FINANCIALLY GAIN అవుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ FAILURE గా చూడొద్దు. BAD జరిగితే మన చుట్టూ ఉన్న BAD PEOPLE మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి.

LIFE లో RISK చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ RISK చెయ్యకపోతే అది ఇంకా RISK. LIFE లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ CLAPS కొడతారు, అక్షింతలు వేస్తారు. SO ఇవన్నీ మీ LIFE లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతె మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరో లా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది.

TRUTH ALWAYS DEFENDS ITSELF. ఎవరినుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న AUDIENCE ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. ACTULLY IM LIABLE TO MY AUDIENCE. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ENTERTAIN చేస్తా. డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా…

Read more RELATED
Recommended to you

Latest news