నేను పాకిస్థాన్ పై జరుగుతున్న ఆపరేషన్స్ పై ఏం మాట్లాడలేను.. కాకపోతే అవి ఇంకా కొనసాగుతున్నాయి.. ఇవి ఎయిర్ చీఫ్ మార్షల్ బీస్ ధనోయా మీడియాతో చెప్పిన మాటలు. ఇవే ప్రస్తుతం భారత్ లో మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే.. భారత్, పాక్ మధ్య అభినందన్ అప్పగింతతో గొడవ చల్లారిందని అందరూ అనుకున్నారు. కానీ.. ఎయిర్ చీఫ్ మాటలు వింటుంటే… భారత్, పాక్ మధ్య గొడవ ఇంకా చల్లారినట్టుగా కనిపించడం లేదు.
పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయడం ఇంకా ఆగలేదని అనుకోవాలి. ఎయిర్ చీఫ్ మాటలు కూడా వాటిని ధృడ పరుస్తున్నాయి. బాలాకోట్ లో భారత వైమానిక దళం జరిపిన దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలను ధ్వంసం చేశారు. దానికి ప్రతీకారంగా పాక్.. తన యుద్ధ విమానాలను భారత్ మీదికి ఉసిగొల్పింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన యుద్ధ విమానాలతో పాక్ విమానాలను వెంబడించింది. ఈక్రమంలోనే ఐఏఎఫ్ పైలట్ పాక్ ఆర్మీకి చిక్కారు. అయితే.. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్ ను భారత్ కు అప్పగించింది.
పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ఏరివేసే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన మీడియాకు వెల్లడించారు. మిగ్ 21 అత్యాధునిక యుద్ధ విమానం. యుద్ధ పరికరాలు గానీ.. రాడార్ సిస్టమ్ గానీ మిగ్ 21 లో బెటర్ గా పనిచేస్తాయి. అది ఉత్తమమైన యుద్ధ విమానం కాబట్టే పాక్ పై దాడులను ఆ యుద్ధ విమానాన్ని వాడాం.. అని ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు.