ఎండి కొండాలు ఏలేటొడా..
అడ్డబొట్టు శంకరుడా…
జోలే వట్టుకోనీ తిరిగెటోడా ..
జగాలను గాసే జంగముడా…
కంఠాన గరళాన్ని దాసినొడా…
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా…
ఆది అంతాలు లేనివాడా… అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా…
నాగభరణుడా…నంది వాహనుడా..
కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..
భీమా శంకరా..ఓం కారేశ్వరా..
శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా..
మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కదా. మంగ్లీ గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మైక్ టీవీ ఆధ్వర్యంలో ప్రతి అకేషన్ కు ఓ పాట యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంటుంది. తాజాగా మైక్ టీవీ మహాశివరాత్రి పాటను రిలీజ్ చేసింది. ఆ పాట నెటిజన్లు తెగ నచ్చడమే కాదు.. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీరు పైన చూస్తున్న లిరిక్స్ ఆ పాటలోనివే. తిరుపతి మాట్ల ఆ పాటను రాశారు. దామురెడ్డి ఆ పాటకు దర్శకత్వం వహించగా.. బాజీ సంగీతం సమకూర్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే వీడియోకు 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మంగ్లీ పాడిన ఈ పాటను చూసేయండి మరి.