బ్యాంకులో ఉద్యోగం మీ కలా..? IBPS నోటిఫికేషన్లు జారీ.. మొత్తం 12,588 బ్యాంకు ఉద్యోగాలు..!

-

ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయడం అనేది చాలామంది కలా..? బ్యాంకింగ్ జాబ్స్ చేయాలనీ ఆశ పడేవారికి ఒక శుభవార్త ఇచ్చింది IBPS. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చెయ్యడానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS ) వరుసగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 12,588 బ్యాంకు ఉద్యోగాలు భర్తీ చేయటానికి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఆఫీసర్ స్కేల్ -I, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనెరా బ్యాంక్ లాంటి ప్రభుత్వ బ్యాంకులతో పాటు రీజనల్ ఇంకా రూరల్ బ్యాంకుల్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. ఈ మూడు నోటిఫికేషన్లకు https://www.ibps.in/ వెబ్ ‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.

ప్రస్తుతం ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఇందులో మొత్తం 3517 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2020 నవంబర్ 11 చివరి తేదీ. ఇకపోతే ఆఫీసర్ స్కేల్ -I, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. ఇందులో మొత్తం 8424 పోస్టులున్నాయి. ఐబీపీస్ ఇదివరకే ఈ పోస్టులని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది. కానీ, కరోనా కారణంగా అప్లై చేయలేని వారికి మరో అవకాశం కలిపిస్తూ మళ్లీ అప్లికేషన్ విండో ఓపెన్ చేసింది.

ఐబీపీఎస్ మరో 647 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ లాంటి అనేక పోస్టులు అందులో ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2020 నవంబర్ 23 చివరి తేదీ. ఐబీపీస్ మొత్తం మూడు నోటిఫికేషన్ల ద్వారా 12,588 బ్యాంకు ఉద్యోగాల భర్తీ చేస్తుంది. బ్యాంకు ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. ఈ మూడు నోటిఫికేషన్ల లలో వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్ అంతా పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోవడం మరవకండి. పూర్తి వివరాలు కోసం ఐబీపీస్ వెబ్‌ సైట్ ను చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news