టీ20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదల

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టీ 20 ప్రపంచ కప్‌ టోర్నీ జరుగనుంది. ఒమన్‌ తో పాటు యూఏఈ లో టీ 20 ప్రపంచ కప్‌ నిర్వహించనున్నారు. నవబంర్‌ 10, 11 తేదీల్లో ఈ టోర్నీ సెమీ ఫైనల్‌ జరుగనుండగా… నవంబర్‌ 14 న ఫైనల్‌ మ్యాచ్‌ లు జరుగనున్నాయి. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌ లకు రిజర్వు డే కేటాయించారు.

ఇక ఇది ఇలా ఉండగా.. టీం ఇండియా మరియు పాకిస్థాన్‌ మధ్య పోరు దుబాయ్‌ వేదికగా అక్టోబర్‌ 24 వ తేదీన జరుగనుండగా.. చిరకాల శత్రువులు ఇంగ్లాండ్‌ మరియు ఆస్ట్రేలియా కూడా దుబాయ్‌ వేదికగా అక్టోబర్‌ 30 న తలపడనున్నాయి. మరో వైపు ఈ టోర్నీ లో టీమిండియా ఐదు మ్యాచ్‌ లు ఆడనుంది. అక్ టోబర్‌ 24 వ తేదీ తో పాకిస్థాన్‌ తో తలబడనున్న కోహ్లీసేన.. నవంబర్‌ 8న గ్రూప్‌ స్టేజి లో చివరి మ్యాచ్‌ ఆడనుంది.