ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత ఎక్కువగా ఆదరణ పొందుతున్న స్పోర్ట్ లో క్రికెట్ ఉంది. ఒకప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే క్రికెట్ ను వీక్షించే వాళ్ళు, కానీ ఇప్పుడు లింగ బేధం లేకుండా పురుషులు మరియు మహిళల క్రికెట్ మ్యాచ్ లను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా ఐసీసీ ఈవెంట్ లకు అంటే… ఆసియా కప్, యాషెస్ సిరీస్, టీ 20 వరల్డ్ కప్, వన్ డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఇలా ఐసీసీ డైరెక్ట్ గా కండక్ట్ చేసే ఈవెంట్ లకు పురుషులకు ఒక విధంగా మరియు మహిళలకు ఒక విధంగా అంటే తక్కువగా బహుమతిగా ఇచ్చే మనీని నిర్ణయించారు. కానీ నేడు ఐసీసీ ఒక మంచి నిర్ణయం మరియు కీలకమైన నిర్ణయం తీసుకుని ఒక్కసారిగా మహిళాలోకాన్ని నివ్వెరపోయేలా చేసింది.
ALL ARE EQUAL: ఐసీసీ ఈవెంట్ లలో వివక్ష లేకుండా సమానంగా ప్రైజ్ మనీ
-