క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడే వాళ్లకు అంతకు మించి మజాను అందించడానికి మరో మూడు నెలల్లో వన్ డే వరల్డ్ 2023 జరగనుంది. ఇప్పటికే ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించగా ఇండియా వేదికగా 5 అక్టోబర్ నుండి 19 నవంబర్ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియాలో మొత్తం పది వేదికల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లను చేయడానికి బీసీసీఐ పక్క ప్లాన్ తో సిద్ధంగా ఉంది. ఈ వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్లు కప్ కోసం పోటీ పడనున్నాయి. కాగా ఈ రోజు ఐసీసీ వరల్డ్ కప్ 2023 పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పది జట్ల కెప్టెన్ లు ట్రోఫీ ముందర ఉండగా విజయోత్సాహంతో ఫోజులిచ్చారు.
కాగా ఇండియాలో గతంలో వరల్డ్ కప్ జరుగగా, ధోని సారథ్యంలో టైటిల్ ను గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇండియాలో ఆడుతుండగా కప్ కొడతారా అన్నది చూడాలి.