కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ సాయం అందుతుంది. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. సామాన్య రైతు నుంచి… కార్పోరేట్ దిగ్గజాల వరకు ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. తాజాగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిసిఐ పెద్ద సహాయమే చేసింది. వంద కోట్ల మేర సహాయం చేస్తున్నట్టు బ్యాంకు ప్రకటనలో తెలిపింది. కరోనాకు ఈ సాయం అందిస్తున్నట్టు తెలిసింది.
రూ.80 కోట్లు పీఎం కేర్స్‌కు ఇవ్వనుండగా… మిగతా రూ.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలకు అందిస్తున్నట్టు తెలిపింది. బ్యాంక్ ప్రెసిడెంట్ సందీప్ బాత్రా ఒక ప్రకటన విడుదల చేసారు. కరోనా ప్రజలకు సవాల్ విసిరిందని ఆయన అన్నారు. ఈ క్లిష్ట సమయంలోనే అందరం కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే తమ వంతు బాధ్యతగా ఈ విరాళాన్ని అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే 2.13 లక్షల సర్జికల్ మాస్కులు, 40 వేలకు పైగా ఎన్95 మాస్కులు, 20 వేల లీటర్ల శానిటైజర్లు, 16 వేల గ్లౌజ్‌లు, 5300 వ్యక్తిగత రక్షణ సూట్లు (పీపీఈ), 2600 ప్రొటెక్టివ్ ఐ గేర్, 50 థర్మల్ స్కానర్లు, వెంటీలేటర్లను పలు ఆస్పత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అందించామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకు ఈఎంఐ మారిటోరియం కి అంగీకరించిన సంగతి తెలిసిందే.