డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు బిల్లు ఇలా కట్టుకోండి…!

-

కరోనా వైరస్ దెబ్బకు అందరూ కూడా ఇప్పుడు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా దెబ్బకు అన్ని కూడా మూత పడిన పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తున్నాం. కట్టడి చేయడానికి చర్యలు తీసుకున్నా సరే లాభం లేకపోవడం తో లాక్ డౌన్ ని పొడిగించింది కేంద్రం. దీనితో ఆర్ధిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. దీనితో బిల్లులు కట్టడం అనేది చాలా వరకు కష్టం.

దీనితో బ్యాంకు లు కూడా ఇప్పుడు ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టడం అనేది చాలా మందికి సవాల్. కట్టకపోతే మాత్రం డిఫాల్టర్ లిస్ట్‌లోకి వెళ్తారు. మళ్లీ అది కాస్తా క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే బిల్లు చెల్లింపు ఎవరూ కూడా ఆపకుండా ఉండటం మంచిది. మరి డబ్బులు లేవు ఎలా కట్టాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇందుకు 5 మార్గాలు ఉన్నాయి.

Balance Transfer: మీ క్రెడిట్ కార్డు బిల్లుల్ని చెల్లించడానికి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఒక మార్గం గా ఉంది. మీ దగ్గర ఇంకో కార్డ్ ఉంటే ఆ కార్డు నుంచి మీరు బిల్లు చెల్లించాలనుకునే కార్డుకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంటుంది. మీరు గరిష్టంగా 90 రోజుల వరకు క్రెడిట్ ఫ్రీ పీరియడ్ వాడుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు అద్జుస్త్ చేసుకునే అవకాశం దొరుకుతుంది.

Snowball Technique: మీ క్రెడిట్ కార్డ్ బిల్లుల్ని చెల్లించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బిల్లులు ఎక్కువగా ఉంటే అప్పుడు ఒక బిల్లు తర్వాత ఒకటి చెల్లించి భారం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముందు తక్కువ బిల్లు ఉన్న దాన్ని క్లియర్ చేసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.

Personal Loan: మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేందుకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పదు అనుకుంటేనే ఈ నిర్ణయం తీసుకోండి. పర్సనల్ లోన్ వడ్డీకి క్రెడిట్ కార్డ్ వడ్డీకి చాలా తేడా ఉంటుంది.

Top-up Loan: ఇప్పటికే ఏదైనా హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తే టాప్ అప్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈఎంఐలు గతంలో గడువులోగా చెల్లిస్తే టాప్ అప్ లోన్ దొరికే అవకాశాలు ఎక్కువ. వడ్డీ రేట్లు కూడా మీరు గతంలో ఎంత చేల్లిస్తారో అంతే ఉంటుంది.

Investments: ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టైతే మాత్రం వాటిని లిక్విడేట్ చేసి క్రెడిట్ కార్డు బిల్లుని చెల్లించే అవకాశం ఉంటుంది. వడ్డీ వస్తున్నా సరే ఇదే మార్గం. పెట్టుబడిపై వచ్చే వడ్డీ కన్నా క్రెడిట్ కార్డ్ వడ్డీ ఎక్కువ కాబట్టి వాడుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news