Aha 2.0: తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. ప్రారంభించిన అతి తక్కువ రోజుల్లోనే అరుదైన గుర్తింపును సంపాదించుకున్న ఆహా. డిజిటల్ రంగంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది. ఆహా అనేలా సంచలనం సృష్టిస్తూ.. తనదైన ముద్ర వేసింది. 20 నెలల్లోనే 50 మిలియన్ల యూజర్లు, 13 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది. ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ కు దీటుగా .. ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో… ఇంట్రెస్టింగ్ గేమ్ షోలతో సాగిపోతోంది.
ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి దీపావళి పండుగ ను మరింత బ్రైట్ పుల్ గా రీలోడెడ్ వెర్షన్‌తో దూసుకురానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ‘ఆహా 2.0’ అవతరించింది.
‘ఆహా’ యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్‌తో వీక్షకులకు అందిస్తూ సంబరాలను తీసుకొస్తుంది . ఈ మేరకు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ నవంబర్ 2న హైదరాబాద్‌లో ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఈ అప్‌గ్రేడ్ వెర్షన్‌లో మరింత వినోదాల విందును అందించనున్నది. అలాగే.. ఆడియో, వీడియో పరంగా మరింత నాణ్యతతో అందిచనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ 2.0 లాంచింగ్ కార్యక్రమంలో త్వరలో ఆహాలో ప్రసారం కాబోయే సూపర్ హిట్ చిత్రాలు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, లక్ష్య, మంచిరోజులొచ్చాయి. డీజే టిల్లు, రొమాంటిక్, అనుభవించు రాజా, పుష్పక విమానం, గని వంటి చిత్రాలతో పాటు.. అన్‌స్టాపబుల్, సేనాపతి, భామా కలాపం, త్రీరోజెస్ వంటి చిత్రాలకు సంబంధించి కూడా వివరాలను తెలియజేయనున్నారు. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అలరిస్తుందో వేచి చూడాలి.