స్ఫూర్తి: సమస్యకి పరిష్కారం చూపి ఎందరికో ఆదర్శంగా నిలిచిన యువరైతు..!

-

పంట పండించడం సులభం కాదు. పంట పండిస్తున్న క్రమంలో రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే పంట కోసం ఎంతో ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టాలి. చాలా మంది రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తోంది.

కలుపు తీయడం, నాట్లు వేయడానికి కూలీల కొరత అధికంగా ఉంది. ఎక్కువ డబ్బులు చెల్లిస్తే కానీ కూలీలు పని చేయరు. అందుకని ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడు యూట్యూబ్ ద్వారా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఆ యువకుడు యూట్యూబ్ లో పలు వీడియోలను చూసి కలుపు తీసే మెషిన్ ని తయారు చేసాడు.

ఈ మిషన్ ను ఉపయోగించి కలుపు తీయవచ్చు. సులభంగా తక్కువ ఖర్చుతో కూలీల అవసరం లేకుండా ఈ పని పూర్తి అయిపోతుంది. మూడు ఫీట్ల పొడవున్న 2 ఇంచుల పివిసి పైపులు ఆఫ్ ఇనుప పైపు 25 గొలుసులతో ఈ యంత్రాన్ని తయారు చేసాడు ఆ యువ రైతు. నిజంగా ఈ విధంగా ఒక మిషన్ ని తయారు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

గొలుసుని లాక్కుని వెళ్తుంటే కలుపు మొక్కలు అవే బయటకు వచ్చేస్తాయి. నిజంగా ఒక యువ రైతు చేసిన ఈ మెషిన్ ని చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎందరికో ఆదర్శం.

Read more RELATED
Recommended to you

Latest news