బిగ్‌ బాస్‌ నుంచి యాంకర్‌ రవి ఎలిమినేట్‌.. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉద్రిక్తత !

-

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 నుంచి యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌ 12వ వారం ఎలిమినేషన్స్‌ లో భాగంగా… యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం నామినేష‌న్స్ లో యాంకర్‌ ర‌వి తో పాటు సిరి, య‌ణ్ముక్, స‌న్నీ, శ్రీ రామ్, కాజ‌ల్, ప్రియాంక ఉన్నారు. దీని లో అందిరిని ఆశ్చ‌ర్య ప‌రుస్తూ యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ అయ్యారు. సీజన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి.. యాంకర్‌ రవి.. చాలా యాక్టివ్‌గా, చాలా బాగా ఫర్‌ పామెన్స్‌ చేసినప్పటికీ… రవి ఎలిమినేట్‌ అయ్యారు.

అయితే… దీనిపై యాంకర్‌ రవి ఫ్యాన్స్‌ రెచ్చి పోయారు. ఎలిమినేషన్‌ కు వ్యతిరేకంగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌ ముందు నిరసన చేశారు యాంకర్‌ రవి ఫ్యాన్స్‌. యాంకర్‌ రవి ఎలిమినేషన్ లో పాదర్శకత లేదని… తెలంగాణ కు చెందిన వ్యక్తి కాబట్టి.. ఎలిమినేట్‌ చేశారని వారు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news