తల్లి బిడ్డకి పాలిస్తే ఆమెకి షుగర్ రాదా..?

-

ఈ మధ్య కాలం లో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైట్ మొదలు వ్యాయామం వరకు ప్రతి దానిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి లేదు అంటే డయాబెటిస్ పేషెంట్లు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తల్లి పాలు మధుమేహం నిర్వహణ ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకుందాం.

 

తల్లి పాలు ఇవ్వడం ఒక నిజమైన వ్యాయామం అని చెప్పవచ్చు. తగ్గిన ఒత్తిడి రక్తం లో షుగర్ స్థాయిని మరియు డెలివరీ తర్వాత స్త్రీ జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మధుమేహం తో బాధ పడే వాళ్లు శిశువుకు తల్లి పాలు ఇవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గొచ్చు.

తల్లి పాలు ఇవ్వడం వల్ల ఛాతి వాపు తగ్గుతుంది. తల్లి పాలను ఉత్పత్తి చేయడానికి రక్తం నుండి గ్లూకోజ్ ని ఉపయోగించడం వలన చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయ పడుతుంది. అదే విధంగా ఎక్స్ట్రా కేలరీలను కూడా ఇది కరిగించడానికి కూడా ఉపయోగ పడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ ని కూడా పెంచుతుంది. ఇలా తల్లులు తమ శిశువుకి పాలు ఇవ్వడం వలన షుగర్ విషయం లో ఈ మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version