Bhadrachalam : నేటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

-

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు అంగరంగ వైభంగా జరగనున్న శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం సర్వం సిద్ధమవుతోంది. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లను ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు రామాలయం ఈవో రమాదేవి తెలిపారు.

www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు ఉంటాయి. రూ.7,500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించి స్వామివారి ప్రసాదం అందజేస్తారు. మిగతా వాటిపై ఒక టికెట్‌పై ఒకరికే అవకాశం కల్పిస్తారు. మొత్తంగా 16,860 మంది టికెట్లతో మండపంలోను, 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

రూ.7,500 టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కార్యాలయంలోనూ నేటి నుంచి విక్రయించనున్నారు. మార్చి 31న నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి ఈసారి 3రకాల ధరలతో టికెట్లను విక్రయించనున్నారు. వీటినీ బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version