పాలిచ్చే గేదెవైతే.. రూ. 7లక్షల కోట్ల అప్పు ఎట్లయింది.?: జూపల్లి

-

బీఆర్ఎస్  ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇచ్చిందని  మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు . తెలంగాణ పాలిచ్చే గేదెవైతే 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యిందని బీఆర్ఎస్ పార్టీ  అధినేత కేసీఆర్ ను ప్రశ్నించారు.గతంలో అవినీతి అక్రమాలు ఇష్టారాజ్యంగా జరిగాయని విమర్శించారు. తానే రాజు, నియంతనని కేసీఆర్ అనుకుంటున్నారని , కేసిఆర్ హయాంలో ప్రజాస్వామ్యం పాతాళానికి పోయిందన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి 7 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టారన్నారు మంత్రి జూపల్లి.

కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిని కేఆర్ఎంబీకి అప్పగించలేదన్నారు జూపల్లి. బీఆర్ఎస్, బీజేపీలు పొత్తుపెట్టుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలనలో బానిస బతుకులుండేవని ,ఇపుడు ప్రగతి భవన్ కు వచ్చి బాధలు చెప్పుకోవచ్చన్నారు. కేసీఆర్ కు ఇంకా అహంకారం తగ్గలేదని ,నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ మాట్లాడే భాష ఇందుకు నిదర్శనం అని అన్నారు. కేసీఆర్ పాలన చేతగాక..రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news