సాధారణంగా సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక ప్రతి విషయంలో కూడా చాలామంది ఈ సెంటిమెంట్ తోనే ముందుకు నడుస్తారు. ఒకవేళ ఈ సెంటిమెంటును కాదని ముందుకు వెళితే ఏ పని కాదు అని గుడ్డిగా నమ్మే సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా విషయంలో కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఇక పాత్రల విషయంలోనే అటువంటి సెంటిమెంట్లు ఉంటాయి. ఏదైనా ఒక పాత్రలో నటిస్తే ఆ పాత్ర తనకు కచ్చితంగా మంచి సక్సెస్ అందిస్తే.. ఇతర సినిమాలలో కూడా తనకు అదే పాత్ర ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు . కానీ ఈ విషయాన్ని చాలామంది కొట్టి పారేస్తున్నారు అని చెప్పవచ్చు.
అయితే రాజీవ్ కనకాల విషయంలో మాత్రం ఒక పాత్ర ప్రతిసారి సక్సెస్ ను అందించింది సీనియర్ నటుడు. దేవదాస్ కనకాల కుమారుడు, బుల్లితెర యాంకర్ సుమను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఇకపోతే రాజీవ్ కనకాల వెండితెరపై, బుల్లితెరపై నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ వస్తున్నారు. 1991లో బాయ్ ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రాజీవ్ కనకాల 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.
ఇకపోతే వెండితెర కంటే ముందే సీరియల్స్ లో కూడా నటించిన ఈయన ఈమధ్య వరుస సినిమాలతో బాగా బిజీగా మారిపోయాడు. ఇకపోతే ఈయన ఎక్కువగా నటించిన పాత్ర ఏదైనా ఉంది అంటే ఆయన పాత్ర చనిపోవడం..
నిజానికి ఏ సినిమాలో అయితే ఈయన పాత్రలు చనిపోయినట్లు ఉంటాయో ఆ సినిమాలు కచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటాయని దర్శక నిర్మాతలకు ఒక సెంటిమెంట్ కూడా ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే లవర్స్, అతిధి , దూకుడు, లవ్ స్టోరీ , హరే రామ, బాద్షా, అరవింద , స్వామి, రాజు గారి గది ఇలా కొన్ని సినిమాలలో ఈయన పాత్రను చనిపోయినట్లుగా చూపించారు. అయితే ఇవన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలే కావడం గమనార్హం.