కేసీఆర్ సర్కార్.. దళిత బందు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే.. తాజాగా దళిత బంధు లబ్దిదారులకు శుభవార్త..చెప్పింది కేసీఆర్ సర్కార్. ఈ పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది.
దీంతో ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంపికైన లబ్దిదారులందరికీ.. ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరిల్లో ఇప్పటి వరకు 38,476 మంది లబ్ది దారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్దిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.3887 కోట్ల ప్రభుత్వం జమ చేసింది. ఇక ఇప్పటికే మంజూరైన దళిత బంధు యూనిట్లకు తాజాగా రూ.600 కోట్లు రిలీజ్ చేయడంతో బకాయిలన్నీ.. చెల్లించేందుకు నిధులు అందుబాటులోకి వచ్చాయి.