సూపర్ స్టార్ లో మార్పు రాకపోతే ఇక నిర్మాతలు ఔటే …!

-

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బాబా’ సినిమా తర్వాత ఇక సినిమాలు మానేయాలనుకుంటున్నాని ప్రకటించారు. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇక శాశ్వతంగా సినిమాలు మానుకోవాలనుకుంటున్నాను ..అందుకే బాబా సినిమా చేస్తున్నాను అంటూ వెల్లడించారు. అయితే బాబా భారీ డిజ్సాస్టర్ గా మిగిలింది. అంటే సూపర్ స్టార్ ఇంకా ఇండస్ట్రీలో కొనసాగాలని ఈ సినిమా ఫ్లాప్ నిరూపించింది. అందుకే ఆయన అనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. బాబా తర్వాత మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.

 

శంకర్ దర్శకత్వం లో వచ్చిన శివాజి, రోబో భారీ స్థాయిలో సక్సస్ ని అందుకున్నాయి. ముఖ్యంగా రోబో ప్రపంచ వ్యాప్తంగా రజనీ మ్యానియాని నిరూపించింది. అయితే ఆ తర్వాత నుంచి రజనీకాంత్ సినిమాలు భారీ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. కబాలి, కాలా, పేట, దర్బార్ సినిమాలు రజనీకాంత్ నుంచి వరసగా వచ్చాయి. కోలీవుడ్ లో ఏ యంగ్ హీరో సినిమాలు ఇంత స్పీడ్ గా రాలేదు. వాళ్ళతో పోటీ పడి రజనీకాంత్ సినిమాలు రావడం గొప్ప విషయం. కానీ వచ్చిన సినిమాలు వచ్చినట్టే డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో నిర్మాతలు బాగా నష్ట పోయారు. అయినా సూపర్ స్టార్ రెమ్యూనరేషన్ మాత్రం కోలీవుడ్ లో అందరికంటే ఎక్కువ.

 

రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన దర్బార్ కి రజనీకాంత్ దాదాపు 80 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. వరుసగా ఫ్లాప్స్ వచ్చినా గాని డిస్ట్రిబ్యూటర్స్ రజనీకాంత్ మీద నమ్మకంతో భారీగా పెట్టి కొనుగోలు చేశారు. కానీ సినిమా భారీగా ఫ్లాప్ కావడం తో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయామని దర్శకుడు మురగదాస్, నిర్మాత అలాగే హీరో రజనీకాంత్ ఇళ్ళ ముందు ధర్నాలకి దిగారు. అయినా రజనీకాంత్ ఇవేమీ పట్టనట్టుగా నెక్స్ట్ సినిమాకి కమిటయ్యారు.

 

అయితే ప్రస్తుతం కరోనా కారణం గా కోలీవుడ్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. దాంతో తమిళ నిర్మాతలు సీనియర్ స్టార్ హీరో అయిన రజనీకాంత్ గనక ముందుకు వచ్చి రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే అందరి నిర్మాతలకి చాలా హెల్ప్ అవుతుందని అలాగే రజనీకాంత్ ని ఆదర్శంగా తీసుకొని మిగతా హీరోలు తమ రెమ్యూనరేషన్ ని తగ్గించుకునే ఆలోచనకి వస్తారని అంటున్నారట. మరి దీని మీద సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news