కరోనా వైరస్ నేపధ్యంలో అసలు డిమాండ్ లేకపోయినా సరే బంగారం ధరలు… బాగా వేగంగా పెరుగుతున్నాయి. ఏ మాత్రం కూడా బంగారం తగ్గడం లేదు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం తో దేశీయంగా కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 410 రూపాయల పెరగడం తో… 40,840 రూపాయలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయల పెరుగుదలతో 44,500 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కేజీకి 150 రూపాయలు పెరగడం తో వెండి ధర 41,150 రూపాయల వద్దకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాములకు 410 రూపాయల పెరిగి… 40,840 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయల పెరుగడం తో 44,500 రూపాయలకు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములకు 150 రూపాయల పెరగడం తో 45,120 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయలు పెరగడం తో… 43,120 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర 41 వేల పై మార్కు పైనే ఉంది. కేజీ వెండి ధర 41,3050 రూపాయలకు చేరుకుంది.