బాబాయ్ ను గొడ్డలితో నరికించిన వాడిని భుజాన వేసుకుని తిరిగే వ్యక్తి సీఎం జగన్ : పవన్ కళ్యాణ్

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబాయ్ ను గొడ్డలితో నరికించిన వాడిని భుజాన వేసుకుని తిరిగే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. రాజోలు వారాహి విజయభేరి సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.ఈ సందర్భంగా మాట్లాడుతూ… సొంత చెల్లి బట్టల ను చూసి వాటిపై కామెంట్స్ చేసే వ్యక్తి జగన్, సొంత చెల్లిపై నీచంగా మాట్లాడే వ్యక్తి జగన్, సొంత తల్లినే ఉపేక్షించనివాడు జగన్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వస్తే మీ భూములు లాగేసుకుంటాడు, ఇప్పటికే పాస్ పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసేసి జగన్ ఫోటో వేసుకున్నాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు, ఈసారి మీ భూములు తాకట్టు పెట్టేస్తాడు జాగ్రత్త .

5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు రాపాక.పేదల ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం చేత అధిక ధరకు స్థలాలు కొనేలా చేసి డబ్బులు నొక్కేసాడు, ముంపు ప్రాంతాల్లో భూమి పేదలకు కేటాయించాడు, ఇసుక దోచేస్తున్నాడు, ఇనుమును వ్యాపారులను బెదిరించి తీసుకుంటున్నాడు, అంతర్వేది రథం దగ్దమైతే ఒక్క మాట మాట్లాడలేదు .

2019 లో ఫైర్ స్టేషన్ కావాలి అన్న వ్యక్తి వైసిపి లో చేరాక దాని గురించి మర్చిపోయాడు, కళాశాల భూములను 500 కోట్ల దోపిడీకి సిద్ధమయ్యాడు అని రాపాక పై పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news