నో మాస్క్ నో పెట్రోల్.. హైదరాబాద్ లో కఠినం గా అమలు..!

-

మాస్క్ లేకుండా బయటకు రావొద్దు బాబూ అని ఏ విధంగా చెప్పినా సరే చాలా మందిలో ఆ సీరియస్ నెస్ ఎక్కడా కూడా కనపడటం లేదు. ఒక పక్క ప్రాణాలు పోతున్నా సరే చాలా మందిలో మార్పు రావడం చాలా కష్టంగా మారింది ప్రధాని మోడీ నుంచి కింది స్థాయి వరకు మాస్క్ విషయంలో ఎన్నో విధాలుగా ప్రచారం చేస్తున్నారు. అయినా సరే మాకు నచ్చిన విధంగానే ఉంటాం అంటున్నారు కొందరు.

మాస్క్ ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో కొన్ని పెట్రోల్ బ౦కులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మాస్క్ లేకపోతే పెట్రోల్ పోసేది లేదని స్పష్టంగా చెప్పాయి. నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డాన్ చాలా కఠినం గా అమలు చేస్తున్నారు. మాస్క్ లను కూడా తప్పనిసరి చేసి దానికి ప్రచారం కూడా మొదలుపెట్టింది ప్రభుత్వం.

అయినా జనాల్లో మార్పు రాకపోవడంతో ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో పలు పెట్రోల్‌ బంక్‌ల వద్ద కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు. మాస్క్‌ ధరించి వస్తేనే పెట్రోల్‌ పోస్తామని స్పష్టంగా చెప్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెట్రోల్‌ బంక్‌లకు వచ్చేవారు మాస్క్‌లు కచ్చితంగా ధరించాలి అని చెప్తున్నారు. ఈ విషయంలో బోర్డ్ లను కూడా ఏర్పాటు చేస్తామని అందరికి వర్తిస్తుంది అని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news