గాల్లో కరోనా వైరస్ ఉంటుందా లేదా అనే దాని మీద శాస్త్రవేత్తలు నిజాలు నిగ్గు తేల్చారు. కరోనా వైరస్ గాల్లో బ్రతికింది అని పేర్కొన్నారు. కరోనా వైరస్ పై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ గాల్లో ఉంటుంది అని గుర్తించారు. వుహాన్(చైనా)లోని రెండు ఆసుపత్రుల్లో గాలిలోని తుంపర్లలోనూ వైరస్ జాడలను గుర్తించారని నేచర్ పత్రికలో ఒక కథనం వచ్చింది.
శాస్త్రవేత్తలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహాన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితోపాటు కొవిడ్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారిని క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి గాలి నమూనాలు సేకరించి భద్రపరిచారు. ఒక నివాస సముదాయం, మరో సూపర్ మార్కెట్, రెండు డిపార్ట్‌మెంటల్ స్టోర్ల నుంచీ గాలి నమూనాలను తీసుకున్నారు శాస్త్రవేత్తలు. వాటి మీద విస్త్రుత పరిశోధనలు చేసారు.
ఆసుపత్రుల గాలి నమూనాల్లో కరోన అబ్రతికి ఉందని మిగిలిన ప్రదేశాల్లో అది లేదని గుర్తించారు. ఆసుపత్రుల్లో జనం గుమిగూడే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, కొవిడ్ బాధితుల గదులు, గాలి సరిగా సోకని ప్రాంతాలు అయిన బాత్ రూమ్స్ టాయిలెట్స్, గాలిలో అత్యల్పస్థాయిలోనే వైరస్ మనుగడ ఉందని తేల్చారు. మనుషులకు ఇది ప్రమాదమా లేదా అనే దాని మీద ఇంకా అంచనాకు రాలేదు వైద్యులు.