ట్రంప్ హెలికాప్టర్ గురించి తెలిస్తే నోరెళ్ళబెట్టి చూస్తారు…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భద్రత అంటే ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ప్రత్యేక భద్రత ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెంట అత్యాధునిక సదుపాయాలతో వాహన శ్రేణి ఉండటం, ఆయన వాడే విమానం, హెలికాప్టర్ వంటివి చాలా శక్తివంతమైనవి. ఏ మాత్రం చిన్న సంఘటన కూడా జరగకుండా ట్రంప్ కి భద్రత కల్పిస్తారు. మెరికల్లాంటి కమాండో లు ఉంటారు.

తాజాగా ట్రంప్ పర్యటన నేపధ్యంలో ఆయన ప్రయాణించే మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌ గుజరాత్ చేరుకుంది. ట్రంప్‌ గుజరాత్‌ చేరుకున్న తర్వాత సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మోతేరా స్టేడియంకు దీనిలోనే ప్రయాణిస్తారని అంటున్నారు అధికారులు. అసలు ఆ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటీ…?

ఈ హెలికాప్టర్ ని అధ్యక్షుడి కోసం సికోర్స్కి అనే కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసింది. పాత వీహెచ్‌-3 మోడల్‌ను త్వరలోనే వీహెచ్‌-92ఏ మోడల్‌ రీప్లేస్‌ చేస్తుంది. ఇది గంటకు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భారీ పేలుళ్లను తట్టుకుని నిలబడుతుంది. అందుకోసం దీనికి ప్రత్యేకంగా బాలిస్టిక్‌ ఆర్మర్‌ ని ఏర్పాటు చేసారు. క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంటుంది.

ఈ హెలికాప్టర్‌ లోపల 200 చదరపు అడుగుల స్థలంతో విశాలంగా ఉంటుంది. ఈ హెలికాప్టర్ లో బాత్‌రూమ్‌ కూడా ఉంటుంది. మొత్తం 14 మంది, 14 మంది హాయిగా ప్రయాణించడానికి కుదురుతుంది. మూడు ఇంజన్లు ఉండటం తో ఒకటి ఫెయిల్ అయినా మిగిలిన రెండూ పని చేస్తాయి. ఈ హెలికాప్టర్‌ను మెరైన్‌ హెలికాప్టర్‌ స్క్వాడ్రన్‌ వన్‌(హెచ్‌ఎంఎక్స్‌-1) నడిపిస్తుంది. అమెరికా మెరైన్‌ ఫోర్స్‌లో భాగం ఇది.

అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర కీలక అధికారుల రవాణాకు తన బాధ్యత తీసుకుంటుంది. ఈ స్క్వాడ్రన్‌లోని నలుగురు పైలట్లను మాత్రమే హెలికాప్టర్‌ లోకి ఎక్కేందుకు అనుమతిస్తారు. నైట్‌ వాక్స్‌ అని వీరికి ఒక పేరుంది. ఈ మెరైన్‌ వన్‌తోపాటు మరో ఐదు డికాయ్‌ హెలికాప్టర్లు ఎప్పుడూ ప్రయాణం చేస్తాయి. అంటే అచ్చు ఆ హెలికాప్టర్ మాదిరిగానే ఉంటాయి. దీనితో ఆయన ఎందులో ప్రయాణం చేస్తున్నారో ఎవరికి తెలియకుండా. బీస్ట్‌కు(కార్లకు) ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news