కుల మతాల గొడవలకు ప్రియారిటి ఇస్తే వెనకబడతాం – మంత్రి కేటీఆర్

-

జేఎన్టీయూలో ఇన్నోవేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ సమావేశాలకు హాజరయ్యారు ఐటి శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, బి.వి.ఆర్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇంటింటికి త్రాగునీరు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. కాలేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నీ తెలంగాణలో కట్టుకున్నామన్నారు.

జేఎన్టీయూ విద్యార్థులు అంతా వెళ్లి ఒక్కసారి ప్రాజెక్టును విజిట్ చేయాలని సూచించారు. మనం ఇంటికి వెళ్లి చుట్టూ చూస్తే అన్నీ వేరే దేశాలు తయారు చేసిన వస్తువులే ఉంటాయని.. ఈ 75 ఏళ్లలో మన ఇండియా ఒక స్పార్క్ మిస్ అయింది అన్నారు. మనం మసీదుని కూలగొట్టి గుడి కడదాం అంటూ గతాన్ని తోడే పనిలో బిజీగా ఉన్నామని అన్నారు. కానీ చైనా లాంటి దేశాలు మ్యానుఫ్యాక్చరింగ్ పై ఫోకస్ పెట్టాయని.. కుల మతాల గొడవలకు ప్రియారిటి ఇస్తే వెనకబడతామని అన్నారు. స్టూడెంట్స్ జాబ్ సీకర్ గా కాకుండా.. జాబ్ క్రియేటర్ గా తయారవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news