ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇన్ఫెక్టర్ ను సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న చందర్ కుమార్ పై సీపీ కి మహిళ ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేయించారు. దర్యాప్తులో అది నిజమే అని తేలింది. దీనితో దర్యాప్తు అనంతరం ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ సీపీ సీపీ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…పోలీసు శాఖ లో ఇలాంటివి సహించేది లేదని సిపి అంజనీ కుమార్ హెచ్చరించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే 949061655 కి వాట్సాప్ సందేశం పంపండని ఆయన సూచించారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో కొందరు పోలీసుల ఆగడాలు ఎక్కువైపోయాయి అనే ఆరోపణలు వినపడుతున్నాయి.