ఓమిక్రాన్ వేరియంట్ వెలగు లోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తం గా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఓమిక్రాన్ మన దేశం లో కి అడుగు పెట్టకుండా ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ వచ్చినా.. దానిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే కరోనా కట్టడి లో ఎంతో కీలక పాత్ర వహించేది.. వ్యాక్షిన్ లు మాత్రమే. దీంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ లు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి.
అయితే గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వ్యాక్సిన్ ల కోసం వినూత్న పద్దతి ని వాడుతున్నారు. ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో వ్యాక్సిన్ వేసుకున్న వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్య వ్యాక్సిన్ తీసుకున్న వారందిరి లో లక్కి డ్రా తీసి మొదటి బహుమతి గా రూ. 60 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఈ లక్కీ డ్రా లో గెలిచిన 25 మందికి రూ. 10 వేల విలువైన బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. అలాగే మురికి వాడ లలో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకుంటే కిలో వంట నూనే ను కూడా ఫ్రీ గా ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన తో అహ్మదాబాద్ లో గత రెండు రోజుల నుంచి వ్యాక్సిన్ లు వేసుకోవడానికి ప్రజలు పోటీ పడుతున్నారు.