నకిలీ వ్యక్తులతో ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మితే నిండా ముంచుతారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సమాజంలో జరిగే మోసాలు, నేరాలపై ఎల్లప్పుడూ ప్రజలకు అవగాహనా కల్పించేలా పోస్టులు పెట్టే సజ్జన్నార్ ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు.‘నకిలీ వ్యక్తులు, మనసులతో జాగ్రత్త!’ అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మన చుట్టుపక్కల చిరునవ్వులతో సంచరించే ఫేక్ మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నకిలీ మనుషులను గుడ్డిగా నమ్మితే..నిండా ముంచుతారన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఎంతటి మాయగాడైన మనం సందు ఇస్తేనే మనవైపునకు చొచ్చుకువస్తాడని హితవు పలికారు. నకిలీ మనుషుల మాటలను బట్టి సులువుగా గుర్తించి..ఒక పరిధిలోనే వారిని ఉంచాలన్నారు.అలా కాదు కూడదని మనం ఆస్కారం ఇచ్చామా..? ఏదో ఒక రోజు నష్టం చేస్తారని ముందస్తు సూచన చేశారు.చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదని ముందస్తుగా సూచించారు.