అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధాన్ని రద్దు చేస్తాం : ప్రశాంత్ కిషోర్

-

బీహార్ లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్  కీలక హామీ ఇచ్చారు.  తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 02న తమ పార్టీ ఆవిర్బావ దినోత్సవం నిర్వహించనున్నామని..అందుకు ఏర్పాట్లు సిద్దమవుతున్నాయని తెలిపారు. జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బీహార్ లో ఉన్న మద్యపాన నిషేదాన్ని ఎత్తేస్తామన్నారు.

ఇందుకోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. రాష్ట్రీయ జనతాదల్ నాయకుడు తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో చేపట్టిన యాత్ర పై మాట్లాడారు. కనీసం అతను ఇప్పటికైనా ఇంటి నుంచి బయటికి వచ్చి ప్రజల మధ్యకు వెళ్లడం మంచి శుభ పరిణామమే అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో చేరినందుకు సీఎం నీతీశ్ కుమార్ తనకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారని ఇటీవల తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వారిద్దరి వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ప్రయోజనం ఏమి లేదని వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలు 30 ఏళ్లుగా వారిని భరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వారు బీహార్ ను విడిచిపెట్టాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news