ఆ గ్రామంలో దోమలు పట్టిస్తే డబ్బులు ఇస్తారట.. వైరల్‌ న్యూస్..!

-

దోమలతో కుట్టించుకోవడం మనకు తెలుసు కానీ.. వాటిని అసలు ఎప్పుడైనా పట్టుకున్నారా..? పట్టుకునే లోపే అవి ఎగిరిపోతాయి. దోమలు కుడితే రకరకాల రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి.. దోమలను వదిలించుకోవడానికి మనం ఏవేవో చేస్తుంటాం.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఓ వార్త వైరల్‌ అవుతోంది. అది ఏంట్రా అంటే.. దోమను పట్టుకుని ఇస్తే డబ్బు చెల్లించే గ్రామం ఒకటి మహారాష్ట్రలో ఉంది.. కోటీశ్వరులు నివసించే అహ్మద్ నగర్ జిల్లాలోని హివ్రే బజార్ అనే గ్రామంలో దోమలు దొరకడం ప్రజలకు ఇబ్బందిగా ఉందని, ఎవరైనా దోమలను పట్టుకుని చూపిస్తే వారికి రివార్డ్‌గా డబ్బులు ఇస్తారని గ్రామస్తులు చెబుతున్నారు..
హివ్రే బజార్ గ్రామంలో 305 కుటుంబాలు నివసిస్తున్నాయి. 80 మంది మిలియనీర్లు ఈ గ్రామంలోనే ఉన్నారట. చుట్టూ పచ్చదనంతో నిండి ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలకు విద్యుత్, నీరు తదితర అన్ని రకాల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. 1980, 90 లలో ఇక్కడ ప్రజలు తీవ్రమైన కరువును ఎదుర్కొన్నారు. ప్రజలు ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి వలస కూడా వెళ్లారట.. కానీ 90వ దశకంలో ‘జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ’ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ స్థలంలో పరిస్థితి మారడం ప్రారంభమైంది.

mosquito

ఈ గ్రామస్తుల కష్టాలు చూడలేక ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం వారి అభ్యున్నతికి నిధులు మంజూరు చేసింది. ఈ గ్రామంలో ప్రజలు దాదాపు 340 బావులు నిర్మించారు. ఇక్కడి కోటీశ్వరుల వార్షికాదాయం 10 లక్షలకు పైగా ఉంటుంది. మరోవైపు ఈ గ్రామంలో 3 కుటుంబాల ఆదాయం 10 వేల లోపే. ఇలా రెండు రకాల ప్రజలూ ఇక్కడే నివసిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..!
కోటీశ్వరులు నివసించే ఈ గ్రామంలో ఒక్క దోమ కూడా లేదు అంటే నమ్ముతారా? ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఎవరైనా ఒక్క దోమను చూపించినా వారికి 400 రూపాయలు బహుమతిగా ఇస్తారు. మీరు అక్కడ దోమను కనుగొంటే, మీరు సులభంగా 400 రూపాయల బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఎందుకు పెట్టారో తెలియదు కానీ.. అందిన సమాచారం ప్రకారం.. ఈ గ్రామం ఎంత క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంటోందో సవాల్‌ విసరడానికే పెట్టినట్లు తెలుస్తుంది.!

Read more RELATED
Recommended to you

Latest news