తెలంగాణలోని ఆ కొండ ఎక్కితే మనుషుల రంగు మారుతుందట..!

-

సైన్స్ ఏ ప్రశ్నకైనా సమాధానం చెబుతుంది అనుకుంటారు కానీ.. సైన్స్ కు చిక్కని రహస్యాలు.. టెక్నాలజీ సైతం తేల్చలేని మిస్టరీలు నేటీకి ఎన్నో ఉన్నాయి.. వీటి పై పరిశోధనలు చేసి మా వల్ల కాదు అని చేతులెత్తేసినవి బోలెడు. సైన్స్ సమాధానం చెప్పలేదంటే.. అది దైవమే అని సమాజం బలంగా నమ్ముతుంది. ఆ కొండ ఎక్కితే మనషులు రంగు మారుతుంది అంట.. అవును మీరు విన్నది నిజమే.. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆన్సల్ దొరకలేదు. ఇది ఎక్కడో కాదు.. మన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే.. ఈ ముచ్చటేందో మీరు ఓ సారి చూడండి..!
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని గుంటపల్లి చెరువు సమీపాన మూడు కిలోమీటర్ల దూరంలో రాసిగుట్ట ఉంది. ఈ గుట్ట పై ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి వారిని దాసాంజనేయ స్వామి అని కూడా అంటారు. స్వామివారిని దర్శించుకున్న వారి శరీరంలోని కాళ్ళు, చేతులు పసుపు రంగులోకి మారిపోతున్నాయి. అసలు గుట్ట పైకి వస్తే ఎందుకు రంగులు మారుతారయనేది చాల మందికి అర్ధం కాని విషయం.

గుట్ట పైకి వెళ్లడం అంత ఈజీ కాదు..

రాసి గుట్ట పైకి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. దట్టమైన అడవిలో మూడు కిలో మీటర్లు రాళ్ల మీద నడక ప్రయాణం కొసాగిల్సిందే. నిలువుగా గుట్ట పైకి ఎక్కాలంటే కష్ట సాధ్యమైనప్పటికి దేవుడి మహిమ చూడడానికి చాల మంది రాసి గుట్టకు తరలి వస్తుంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గం ఉండదు. అడవి జంతువుల భయం వెంటాడుతునే ఉంటుంది. రాళ్ల మధ్య నడుచుకుంటూ గుట్టను ఎక్కాలంటే మాత్రం ఓ సాహసమనే చెప్పుకోవాలి.
రాసి గుట్ట పైకి వెళ్లిన తరువాత శరీరం రంగు మారుతుంటుంది. కాళ్లు పసుపు రంగులో, చేతులు ఎరుపు రంగులోకి మారుతుంటాయి. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా ఆంజనేయ స్వామి మహిమే అంటున్నారు భక్తులు.
శరీరం రంగులు మారేది స్సష్టంగా కనిపించాలంటే ఉదయం 11 గంటల వరకు గుట్టపైకి వెళ్లాలి. అప్పుడు కాళ్లు, చేతులు రంగు మారే దృశ్యాన్ని స్సష్టంగా చూసుకోవచ్చు. గుట్ట ఎక్కె వరకు శరీరమంతా మాములు రంగులోనే ఉంటుంది. ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకోగానే శరీర రంగులో మార్పు కనిపించడం మొదలవుతుంది. నిమిషాల్లో పాదాలు పసుపు రంగులోకి మారిపోతుంటాయి. అయితే శరీర రంగులు మారే విషయంలో పరిశోధనలు కోనసాగినప్పటికి.. కోంత మంది రాళ్ల స్వభావంతోనే అలా జరుగుతుందని అంటున్నారు. అయితే ఆ మాటలతో స్థానికులు ఏకీభవించడం లేదు. దశాబ్ద కాలంగా రాసి గుట్ట రహస్యం తెలియక అంజన్న మహిమాగానే భావిస్తున్నారు భక్తులు.
అసలు ఎందుకు రంగు మారుతుందని అని తెలుసుకోవడానికే చాలామంది గుట్ట ఎక్కుతారు.. అయినా వారికి సమాధానం దొరకడం లేదు. ఇంకా హైలెట్ ఏంటంటే.. అక్కడ ఉన్న ఓ తొండ సైతం కాషాయం రంగులోనే కనిపించడం విశేషం.
ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత వేసవి అయినా నీరు పుష్కలంగా ఉంటుందట. రాసి గుట్ట సమీపంలో సిద్ధులు, ఋషులు తపస్సు చేసుకునే వారని, వారు నీటి గుండాన్ని, బావిని ఏర్పాటు చేశారని, సంవత్సరాలు గడచినా అందులో నీరు మాత్రం ఇంకిపోదని.. అది దైవ స్వరూపమని స్థానికులు అంటారు. వర్షాకాలంలో అద్భుతమైన జలం పాతం దర్శనమిస్తోంది. దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉండడంతో ఆధ్యాత్మికం, పర్యాటకం, ప్రకృతికి నిలువుటద్దంగా రాసి గుట్ట నిలుస్తోంది.
రాసి గుట్ట పై లభించే రాళ్లను ప్రసాదంగా భావించి తింటుంటారు. అవును వినడానికి వింతగా అనిపించివచ్చు. రాసి గుట్టపై ఉండే రాళ్లు చిన్నపిల్లలు రాసుకోవడానికి, తినడానికి వాటిని ఉపయోగిస్తారు. వాటిని రాసి గుట్ట బలపాలు అని పిలుస్తుంటారు. కాలితో తాకితే గరుకుగాను గట్టిగానూ రాయి వలే ఉన్నప్నపటికి నోట్లో వేసుకుంటే మాత్రం మెత్తగా తీయ్యగా ఉంటాయి..
 అలా రాసి గట్టు రహస్యం గుట్టుగా మిగిలిపోయింది. వీలైతే మీరు ఎక్కి చూడండి.!

Read more RELATED
Recommended to you

Latest news