రెండున్నర ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10 లక్షలకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని టాప్ న్యూస్‌ల గురించి తెలుసుకుందాం..
- ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక ప్రభుత్వం ఎయిర్ లైన్స్ ను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించిన తర్వాత కూడా నష్టాలు భరించే అవకాశం ఉంది. అయితే దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్ష ప్రవేశ పెట్టిన డెవలప్‌మెంట్ బడ్జెట్ స్థానంలో రిలీఫ్ బడ్జెట్‌ను ప్రవేశించనున్నారు.
- కరోనా విజృంభణ కారణంగా చైనా ఆర్థిక నగరమైన షాంఘై కఠిన ఆంక్షలు విధించింది. దీంతో అక్కడి ప్రజలకు తినడానికి ఆహారం, నిత్యావసరాల కొరత ఏర్పడి అల్లాడుతున్నారు. అయితే నేటి నుంచి పలు జిల్లాలో కరోనా ఆంక్షలను సడలించారు.
- ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేవలం 4 రోజుల వ్యవధిలో దాదాపు 10 లక్షల కరోనా కేసులు నమోదు అయినట్లు సమాచారం. కరోనా సంక్షోభంపై కింగ్ కిమ్ జోంగ్ ఉన్ సీరియస్‌గా ఉన్నారని, ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని కఠిన నిబంధనలు జారీ చేశారు.