విశాఖ నగరంలో బైక్ రేసింగ్ ల విషయంలో ఇప్పుడు కాస్త సీరియస్ గా ఉన్నారు అక్కడి పోలీసులు. ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ లు కూడా చేపడుతున్నారు. తాజాగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో బైక్ రేసింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సిటీ పోలీస్ లు కొందరికి షాక్ లు ఇచ్చారు. వారం రోజులు పాటు బైక్ రెసింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము అని డీసీపీ – ఐశ్వర్య రస్తోగి అన్నారు. 211 బైక్ లు సీజ్ చేసాము 220 మంది మీద 195 కేసులు నమోదు చేసాము అని చెప్పారు.
చాలా మంది నెంబర్ ప్లేట్స్ లేకుండా బైక్ లు నడుపుతున్నారు అని మండిపడ్డారు. ఈ బైక్ రెసింగ్ పాల్పడే వారిలో 18 నుండి 25 ఏళ్ళు లోపే ఉన్నారు అని చెప్పారు. నగరంలో బైక్ రేసింగ్ గ్రూపు లు ఉన్నాయని ఆమె అన్నారు. వాట్స్ యాప్ లో గ్రూపు క్రీయేట్ చేసుకోని రేసింగ్ కు పాల్పడుతున్నారని, తల్లి దండ్రులు సైతం పిల్లలు పై దృష్టి పెట్టాలి అని హెచ్చరించారు. మీరు బైక్ కొనిచ్చి వదిలేయడం వల్ల వారు ఇలాంటి రేసులుకు పాల్పడుతున్నారు అని ఆమె అన్నారు.