చంద్రబాబు చెప్పినట్లు ఆయన చేస్తున్నారు : మంత్రి అనిల్

-

గత కొన్ని రోజుల నుంచి పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్ష టిడిపి పార్టీ అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది అన్న విషయం తెలిసిందే. పోలవరం నిర్మాణంలో జగన్ సర్కార్ ఎన్నో అవకతవకలకు పాల్పడుతున్నది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో సిపిఐ నేత రామకృష్ణ కూడా ప్రస్తుతం జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… చంద్రబాబుపై సిపిఐ రామకృష్ణ పై విమర్శలు గుప్పించారు.

తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తును తగ్గిస్తుంది అంటూ తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు విమర్శలు చేయడమే కాక అటు సిపిఐ రామకృష్ణ తో కూడా విమర్శలు చేయిస్తున్నారని చంద్రబాబు ఎజెండా అని రామకృష్ణ ఫాలో అవుతున్నారు అంటూ విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఒక్క అంగుళం కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news