ఈ వ్యాధులు ఉంటే స్వీట్‌ పొటాటోస్‌ అస్సలు తినకూడదు…చాలా ప్రమాదం..?

-

స్వీట్‌ పొటాటోస్‌ లేదా చిలగడదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్ లా ఉడికించుకుని తినొచ్చు..ఇందులో ఉండే పిండి పదార్ధాలు, కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, ఆర్థరైటిస్‌తో పోరాడుతున్న వారికి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయినప్పటికీ…కొన్ని వ్యాధులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు..ఇప్పుడు ఆ వ్యాధులు ఏంటో చూద్దామా..

మూత్రపిండంలో రాళ్లు ఉన్నవారు

కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఆక్సలేట్ నొప్పిని పెంచుతుంది. దీనివల్ల మీకు మరింత హాని కలుగవచ్చు.

ఉదర సమస్యలున్నవారు

చిలగడ దుంపలు మన్నిటాల్‌ను కలిగి ఉంటాయి. ఇది షుగర్ ఆల్కహాల్ లేదా పాలియోల్ అని పిలువబడే కార్బోహైడ్రేట్ రకం. ఈ కార్బోహైడ్రేట్ తీసుకోవడం పొట్ట సమస్యలతో బాధపడేవారికి ఇంకా సమస్యలను కలిగిస్తుంది. విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం వంటివి వస్తాయి. అందువల్ల పొట్ట సమస్యలు ఉన్నవారు వీటిని తినడం మంచిది కాదు.

గుండె సమస్యలు ఉన్నవారు

చిలకడదుంపలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే ప్రమాదకరం. పొటాషియం అధికంగా తీసుకోవడం వల్ల హైపర్‌కలేమియా లేదా పొటాషియం టాక్సిసిటీకి దారి తీయవచ్చు ఇది గుండెపోటుకు దారితీస్తుంది.

మధుమేహం ఉన్నవారు

చిలగడదుంపలు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చిలగడదుంప శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందట.అలా అనీ..ఇది ఎక్కువగా తీసుకోకూడదు.రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఘగర్ ఉన్నవాళ్లు ఎలాంటి దుంపలను తినకూడదని వైద్యులు చెబుతారు. దంపులు తింటే..ఘగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. కంద అయితే తినొచ్చు. అది కూడా వైద్యులను సంప్రదించి ఆపై తినటం మంచిది.

జీవితం ఎలా మారుతుందంటే..అన్నీ తిన్నా ఏం కాని ఏజ్ లో మనకు ఏదీ నచ్చదు. చిన్నప్పుడు పాలు తాగమంటే మారాం చేస్తారు. పెద్దయ్యాక పెరుగు అసహ్యించుకుంటారు. పిజ్జాలు, బర్గర్లకు ఇష్టపడతారు. ఒక 25-30 ఏళ్ళ వరకూ తినకలిగే అన్నింటిని తినాలి. ఇది ఇష్టం , ఇది ఇష్టం లేదు అని చాలావాటిని పక్కన పెట్టుకుంటూ వస్తే..ఆ తర్వాత మనం ఏదీ తినలేం. ఒక దశలో సరిగ్గా తింటేనే అనారోగ్యం వచ్చేస్థాయికి చేరుకుంటాం. లక్షలు ఖర్చుపెట్టినా..లక్షణంగా అన్నీ తినలేం.. పెద్దోళ్లు అయ్యేకొద్ది..ఆహారంలో ఉప్పుతగ్గించాలి, స్వీట్స్ కు దూరంగా ఉండాలి. ఇది తొనొద్దు. అది తాగొద్దు అని వైద్యులు చెప్తారు. కాబట్టి దేన్నైనా ఈజీగా జీర్ణం చేసుకునే శక్తి మనకు ఉండేది. యంగ్ గా ఉన్నప్పుడే..అప్పుడే అన్నింటిని టేస్ట్ చేసేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news