హీరో గోపీచంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలివలపు సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత విలన్ గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ తర్వాత యజ్ఞం సినిమాలో హీరోగా నటించి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా హిట్ కావడంతో హీరోగా గోపీచంద్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇకపోతే గోపీచంద్ మే 12 2013లో రేష్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు . మరి రేష్మ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అని తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.

రేష్మ ఎవరో కాదు హీరో శ్రీకాంత్ మేనకోడలు.. శ్రీకాంత్ సొంత అక్క కూతురే ఈ ముద్దుగుమ్మ. గోపీచంద్ బాబుకి తన భార్య కోరిక ప్రకారం విరాట్ అనే పేరు పెట్టాడు… గోపీచంద్ కి రేష్మ ఫోటో నచ్చడంతో సంబంధం మాట్లాడమని చెప్పాడట. అలా వీరి పెళ్లికి పెద్దగా సీనియర్ నటుడు చలపతిరావు దగ్గరుండి మరి వివాహం జరిపించారు. శ్రీకాంత్ తన మేనకోడలిని గోపీచంద్ కు ఇచ్చి వివాహం జరిపించడానికి .. నాకంటే చాలా మంచోడు గోపీచంద్.. కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడట.

మేనమామ మాటను కాదనలేక రేష్మ గోపీచంద్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా రేష్మ గోపీచంద్ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు . చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అన్నట్టుగా భారీ పాపులర్ దక్కించుకుంది ఈ జోడి. ఏది ఏమైనా శ్రీకాంత్, గోపీచంద్ అలా బంధువులయ్యారన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news