టాలీవుడ్ హీరో వైష్ణవి తేజ్, కేతిక శర్మ కలిసి నటించిన చిత్రం రంగ రంగ వైభవంగా.. ఈ చిత్రం ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ నిలిచింది. దీంతో హీరో వైష్ణవ తేజ్ వరుసగా రెండు ఫ్లాప్ లను చవిచూశారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. వైష్ణవ తేజ్ మొదటి హీరోయిన్ కృత్తి శెట్టి కూడా వరుసగా రెండు ఫ్లాపులను చవి చూసింది.
అయితే నాన్ థియేట్రికల్ ఆదాయంగా రూ.21 కోట్ల రూపాయలు రాగ మిగిలిన రూ.7 కోట్లు థియేటర్స్ నుంచి రావాల్సి ఉన్నది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందాన్ని తిప్పడానికి రూ.25 లక్షల వరకు ఖర్చయినట్లుగా సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ తీసుకోవడంతో ఆయనకు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్ నుంచి కేవలం రూ.2 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసిందట. మొత్తం మీద ఈ సినిమాకి రూ.5 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని సమాచారం. అయితే ఈ సినిమా కొన్న బయ్యర్లకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది.