హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సంపాదించేసింది..

-

నెల జీతం కోసం ఉద్యోగులు పడని కష్టాలుండవు. ఓవర్ టైం వర్క్ చేయడం.. నిద్రలేకుండా పనిలో నిమగ్నమవ్వడం.. ఓపిక లేకపోయినా.. నిద్ర సరిపోకపోయినా నెలజీతం కోసం 30 రోజులు తెగ కష్టపడతాం. కానీ కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి మాత్రం కాలు కింద పడకుండా ఈజీగా రూ.5 లక్షలు సంపాదించేసింది. అదేలాగ అంటారా..?

కంటి నిండా నిద్ర కోసం పనంతా పక్కన పెట్టి పడుకునే వారుంటారు. కానీ హాయిగా నిద్రపోవడమే పని అయితే దానికీ జీతం ఇస్తే ఆహా వినడానికే ఎంత బాగుందో కదా. వేక్‌ఫిట్‌ ఇదొక పరుపుల తయారీ సంస్థ. నిద్రను ప్రోత్సహించడమే ముఖ్యోద్దేశంగా ‘స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌’ పేరుతో ఏటా ఓ పోటీని నిర్వహిస్తోంది. ఇందుకోసం లక్షల కొద్దీ అందిన దరఖాస్తుల్ని పరిశీలించి.. 15 మందిని ఇంటర్న్స్‌గా ఎంపిక చేస్తారు. వీరికి ఒక పరుపుతో పాటు, స్లీప్‌ ట్రాకర్‌ అందిస్తారు. వాటిని ఉపయోగించుకొని ఎవరింట్లో వాళ్లు వరుసగా వంద రోజులు రోజుకు 9 గంటల చొప్పున ఎలాంటి అంతరాయం లేకుండా సుఖంగా నిద్ర పోవాల్సి ఉంటుంది.

ఇలా వాళ్ల నిద్ర నాణ్యతను పరిశీలించి.. నలుగురిని తుది రౌండ్‌కు ఎంపిక చేశారు. వీరిలో ఒకరిని విజేతగా ఎంపికచేస్తారు. వాళ్ల నిద్ర నాణ్యతను బట్టి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు నగదు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కల్పించిందీ సంస్థ. ఈ క్రమంలోనే గతేడాది నిర్వహించిన రెండో సీజన్‌లో 95 శాతం నాణ్యతను సాధించి విజేతగా నిలిచింది కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి. తద్వారా రూ. 5 లక్షల నగదు బహుమతి అందుకుంది. ‘భారత తొలి స్లీప్‌ ఛాంపియన్‌’గా నిలిచింది. ఇక మిగతా ముగ్గురు ఫైనలిస్టులకు రూ. లక్ష చొప్పున అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version