ఉదయాన్నే ఈ ఆహారపదార్ధాలు తీసుకుంటే నీరసం రాదు..!

-

ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో వీటిని తీసుకుంటే రోజంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలసట, నీరసం వంటివి కూడా ఉండవు. మరి ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. న్యూట్రిషనిస్ట్ కొన్ని విషయాలను మనతో పంచుకున్నారు. వీటిని యధావిధిగా ఫాలో అయితే మీరు ఎనర్జిటిక్ గా ఉండడానికి వీలవుతుంది.

ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. వేరుశెనగ పలుకులు, మొలకలు, ఉడికించిన గుడ్లు, పాలు, సోయా బీన్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది మరియు రోజంతా అలసట లేకుండా చూస్తుంది.

వేరుశెనగ పలుకులు:

మీరు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని పల్లీలు తీసుకుని నీళ్ళలో నానబెట్టండి. ఆహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం నానబెట్టిన వేరుశనగ పలుకుల్లో పొటాషియం, కాపర్, కాల్షియం, ఐరన్, సెలీనియం ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అదే విధంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

తేనె:

గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని పరగడుపునే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. దీనితో పాటుగా విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.

బాదం:

బాదం లో కూడా పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి రాత్రి బాదం నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది. బాదంలో విటమిన్స్, మ్యాంగనీస్, ప్రోటీన్, ఫైబర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఆపిల్, కమల పండ్లు:

ఆపిల్ మరియు కమలాపండ్లు అల్పాహారం సమయంలో తీసుకుంటే మంచిది. ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది. అదే విధంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు.

ఉడికించిన గుడ్లు:

ఉడికించిన గుడ్లలో విటమిన్ డి ఉంటుంది ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది కాబట్టి రెగ్యులర్ గా వీటిని అన్నిటినీ తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news