కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబయికి నమ్మకద్రోహం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని మావోయిస్టుతో పోల్చిన ఆయన.. దాన్ని అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పతానావస్థకు చేరుతుందని చివరకు భారత్ దివాళా తీస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
“మనుగడే కష్టంగా మారిన కాంగ్రెస్ ఇష్టానుసారంగా హామీలు ఇస్తోంది అని మండిపడ్డారు. దేవాలయాల్లో బంగారం, మహిళల మెడలో మంగళసూత్రాలపై కాంగ్రెస్ పార్టీ కన్ను పడింది అని విమర్శించారు. 50 శాతం వారసత్వ పన్ను విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రజల ఆస్తిని ఎక్స్ రే తీసి, ఓట్ జిహాద్ గురించి మాట్లాడే వారి ఓటు బ్యాంకుకు అప్పగిస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు..