కరెంట్ బిల్ ని సగానికి తగ్గించుకోవాలంటే ఇలా చెయ్యండి..!

-

వేసవి కాలం ప్రారంభం అవడంతో కరెంటు వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్యాన్లు, ఏసీలు అలా తిరుగుతూనే ఉంటున్నాయి. అయితే కరెంట్ బిల్లు ని ఆదా చేసుకోవడం కోసం ఈ టిప్స్ ని కనుక ఫాలో అయితే ఎవరి ఇంట్లో అయినా సరే కరెంట్ బిల్లుని తగ్గించుకోవడానికి అవుతుంది. అయితే మరి ఎలా కరెంటు బిల్లు ని ఆదా చేసుకోవచ్చు..? సగానికిపైగా కరెంట్ బిల్లు ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

 

మీ ఇంట్లో ఏసి ఉపయోగిస్తున్నట్లు అయితే ఏసీ బిల్లు తగ్గడం కోసం ఏసిని 16 నుండి 24 డిగ్రీల వద్దకు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు కావలసినంత కూలింగ్ వస్తుంది. అలాగే కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది.
అలానే మీ ఇంట్లో వాడే బల్బులు పైన కూడా కాస్త శ్రద్ధ పెట్టాలి. వివిధ బల్బులను ఉపయోగించడం కంటే ఎల్ఇడి బల్బులు ని ఉపయోగించండి ఇతర బల్బుల కంటే ఇవి 90 శాతం తక్కువ కరెంటు వినియోగిస్తాయి. కాబట్టి వీటిని మార్చిన సరే మీరు కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చు. ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ ని కొనుగోలు చేస్తే కూడా పవర్ సేవ్ చేసుకోవచ్చు. అలానే పొడిగా ఉన్న బట్టల్ని ఐరన్ చేయడం వల్ల కూడా పవర్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఐరన్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరెంట్ బిల్ సేవ్ అవుతుంది.
అలానే మీ ఏసీ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి. అవుట్డోర్ ఏసి యూనిట్ పైన సూర్య కాంతి పడితే ఎక్కువ పవర్ ని వినియోగిస్తుంది.
అదే విధంగా ఫ్రిడ్జ్ కి గాలి తగిలేలా ఉంటే త్వరగా చల్లబడుతుంది. దీనివల్ల కూడా పవర్ సేవ్ అవుతుంది. కాబట్టి మీ ఫ్రిడ్జ్ ని బాగా వెంటిలేషన్ ఉండే ప్రాంతంలో పెట్టండి. ఇలా మీ ఇళ్ళల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే పవర్ ని సేవ్ చేసుకోవచ్చు. నిజానికి సగానికిపైగా కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news