ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఇక నుంచి వారికీ కూడా “జగనన్న వసతి దీవెన”

-

నంద్యాల : ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్‌. 10 లక్షల మందికి జగనన్న వసతి దీవెన కింద 2021 22 కి 1,024 కోట్లు తల్లుల ఖాతాలోకి వేస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కోర్సును బట్టి 10 వేలు, 15, వేలు, 20 వేలు జగనన్న వసతి దీవెన కింద ఇస్తున్నామని…ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లుల ఖాతాలోకి రెండు విడతలుగా ఇస్తామని స్పష్టం చేశారు.

ప్రతి పార్లమెంమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..జిల్లా చేసి ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాం…పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని వెల్లడించారు. పాదయాత్రలో ఎన్నో గాథలు విన్నా…..విద్యారంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశామని…అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నామని చెప్పారు. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news