ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమను నిలబెట్టుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నిజానికి ప్రేమ నిలబడాలంటే నచ్చినట్లు ప్రవర్తించకూడదు. మీ ప్రేమ కలకాలం అలానే ఉండాలంటే ఈ విధంగా అనుసరించండి. అప్పుడు మీ ప్రేమ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది.
ప్రతి రోజు ఒక స్పెషల్ గా ఏదో ఒకటి చేయండి:
ప్రతి రోజు కూడా వాళ్లతో కలిసి భోజనం చేయడం లేదు అంటే మీరంటే వాళ్లకి ఇష్టం అన్నట్టు చెప్పడం, చూపించడం లాంటివి చేయండి. ఇలా చేయడం వల్ల ప్రేమ కలకాలం ఉంటుంది.
మీకు ఏమి ఇష్టమో చెప్పండి:
మిమ్మల్ని ఆనందంగా వాళ్ళు ఉంచితే మీ పార్ట్నర్ కూడా ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు ఆనందంగా ఉంచుతున్నందుకు వాళ్ళు మరింత ఆనందంగా ఉంటారు. కనుక వాళ్లకి తప్పకుండా దీని గురించి చెప్పండి.
మీ పార్ట్నర్ ప్రేమించే వాళ్ళకి ఇష్టమైనవి చేయండి:
మీ పార్ట్నర్ ఏమి కోరుకుంటున్నారు..? ఎవరంటే ఇష్టమో వాళ్ల పట్ల కూడా మీరు ఇష్టం గా ఉండండి. ఇది కూడా వాళ్ళకి సంతోషాన్నిస్తుంది.
ప్రేమగా వాళ్లతో ఉండండి:
సరదాగా వారితో సమయాన్ని స్పెండ్ చేయడం, చేతులు పట్టుకుని కూర్చోవడం, కలిసి సినిమా చూడటం, ఐ కాంటాక్ట్ ఇవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చిన్న చిన్నవి ఉంటాయి. ఇటువంటి వాటి తో మీరు ప్రేమ గా ఉండొచ్చు.
సరదాగా ఇలాంటివి చేయండి:
రోలర్ కోస్టర్ రైడ్, బెలూన్ ట్రిప్ ఇలాంటివి వాళ్ళకి నచ్చినవి చేయండి. ఇది కూడా వాళ్ళలో ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి మీరు అంటే ఎంత ఇష్టమో చెప్పండి మీ యొక్క ప్రేమని వాళ్ళకి తెలుపుతూ ఉండండి. ఇలా మీరు వాళ్లతో ఉంటే కచ్చితంగా ప్రేమ గా ఉండడానికి అవుతుంది.