కూల్‌డ్రింక్స్ అతిగా తాగితే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే.. అయినా గాని చాల మంది ఆ విషయాన్ని పట్టించుకోకుండా మంచినీళ్లు తాగినట్లుగా ఈ కూల్‌డ్రింక్స్ ను తాగేస్తుంటారు.. డాక్టర్స్ చెప్పినా వినిపించుకోరు.. అయితే అన్ని వేళలు మనవి కాదు.. ఇక కూల్‌డ్రింక్స్ తయారు చేసే వారి తప్పో ఏమో తెలియదు గాని ఒక్కోసారి కూల్‌డ్రింక్స్ లో పురుగులు రావడం మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది.. ఇదిగో ఇప్పుడు కూడా ఒక మహిళ కూల్‌డ్రింక్స్ లో పురుగులున్న విషయాన్ని గమనించక తాగేసింది.. ఆ తర్వాత హస్పిటల్ పాలైంది.. ఆ వివరాలు తెలుసుకుంటే..
తూర్పుగోదావరి జిల్లాలో, సీతానగరం మండలంలోని వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు వద్ద గల ఒక హోటల్లో పనిచేస్తున్న మహిళ అలసటగా ఉండటంతో, ఆ పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపు నుంచి అరలీటర్ థమ్స్ అప్ బాటిల్ తెప్పించుకుని ఆ డ్రింక్ తాగుతుండగా దుర్వాసన రావడంతో బాటిల్‌ను పరిశీలించి షాక్ అయ్యింది.. ఎందుకంటే అందులో పురుగులు కనిపించాయి. ఆ వెంటనే డ్రింక్ తాగిన నజీమాకు వాంతులు మొదలై అపస్మారక స్థితికి చేరుకుంది.
ఇక హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను సీతానగరం బస్టాండ్ వద్దగల శ్రీ రమా నర్సింగ్ హోమ్ కు తరలించారు.. ఆ మహిళను పరిశీలించిన వైద్యులు తన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.. చూశారా ఆరోగ్యంగా ఉన్న వారు అనారోగ్యాన్ని కొనుక్కోవడం అంటే ఇదే కావచ్చూ.. ముందే లోకంలో కరోనా అనే తమ్ముడు ఉన్నాడు..