పర్యావరణ కాలుష్యం అనేది రోజురోజుకీ పెరిగిపోతోంది. మనిషి చేస్తున్న అనేక తప్పిదాల వల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. ముఖ్యంగా పేపర్లను విపరీతంగా వాడుతున్నందున వాటి పరంగా కాలుష్యం కూడా ఎక్కువవుతోంది. అయితే ఈ సమస్యను కొంత వరకైనా పరిష్కరించాలని చెప్పి ఆ ఐఎఫ్ఎస్ అధికారి వినూత్న రీతిలో విజిటింగ్ కార్డులను తయారు చేసి వాడుతున్నారు. ఆ కార్డులను నాటవచ్చు. మొక్కలు మొలుస్తాయి.
ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తాజాగా ట్విట్టర్ లో తన విజిటింగ్ కార్డును ఫొటో తీసి దాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ అంత స్పెషాలిటీ ఆ కార్డులో ఏముందంటే.. అది ఒక ప్లాంటబుల్ విజిటింగ్ కార్డు. అంటే ఆ కార్డుతో పని అయిపోయాక దాన్ని కుండీలో మట్టిలో నాటవచ్చు. అందులో ఉండే ఆర్గానిక్ విత్తనాలు మొలకెత్తుతాయి. అవి మొక్కలుగా మారుతాయి. ఈ క్రమంలో ఆ కార్డుల గొప్పదనం తెలుసుకున్న అనేక మంది వాటిని ఉపయోగించడం కోసం పర్వీన్ కాస్వాన్ ను అవి ఎక్కడ లభిస్తాయి, ఎలా పొందాలి అనే వివరాలను అడుగుతున్నారు.
అయితే ప్లాంటబుల్ విజిటింగ్ కార్డులను పొందేందుకు పలు వెబ్‌సైట్ లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. వైల్డ్ లెన్స్ (WildLense), పెపా (Pepaa), సీడ్ పేపర్ ఇండియా (Seed Paper India) అనే పలు సైట్లలో పైన తెలిపిన ప్లాంటబుల్ విజిటింగ్ కార్డులను పొందవచ్చు. ఆ కార్డులలో ఆర్గానిక్ విత్తనాలను అమర్చి వాటిని మనకు తయారు చేసి ఇస్తారు.
So now anybody coming to my office is getting this. This card when planted grows into a bright basal plant. Thanks @WildLense_India. pic.twitter.com/xL9xgPCbbF
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 1, 2020