బరువుతో పాటు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్న బ్యూటీ…!

-

ఎంత పెద్ద హీరో అయినా, ఎలాంటి కథైనా చెప్పినంత ఇస్తేనే కాల్షీట్స్ అన్నట్లు కటింగ్స్‌ ఇచ్చింది. కానీ ఇప్పుడు బొమ్మ రివర్స్‌ అయ్యింది. సక్సెస్‌లో ఉన్నప్పుడు ఇలియానా బోల్డంత కలరింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు హీరోలు ఇల్లీని పట్టించుకోవడమే మానేశారు. దీంతో కటింగ్స్‌ తగ్గించుకుని, నేల మీదకి వచ్చేసిందట. మీరు ఎంత అనుకుంటే అంతే ఇవ్వండి, కానీ సినిమాలో మాత్రం చాన్స్‌ ఇవ్వండని రిక్వెస్ట్‌ చేస్తోందట ఇలియానా.


ఇలియానా కుర్రాళ్లలో క్రేజ్‌ చూసుకుని సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ, టాలీవుడ్‌లో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్‌ హీరోయిన్‌గా నిలిచింది. అలాంటి హీరోయిన్‌కి ఇప్పుడు సినిమాలు రావడమే కష్టంగా ఉంది. కెరీర్‌ ముందుకెళ్లడం పెద్ద సవాల్‌లా తయారైంది. దీంతో బోల్డన్ని మెట్లు దిగి నేలమీదకి వచ్చేస్తోంది ఇల్లీ. టాలీవుడ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నప్పుడు ‘బర్ఫీ’తో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ఇక ముంబాయి వెళ్లిపోయాక టాలీవుడ్‌ని పక్కనపెట్టేసి అక్కడే వరుస సినిమాలు చేసుకుంది. అయితే తెలుగు ఇండస్ట్రీని పక్కనపెట్టి మరీ బీటౌన్‌కే అంకితమైపోయినా ఇలియానాకి అక్కడ సూపర్‌ స్టార్డమ్‌ రాలేదు. దీనికితోడు బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో బ్రేకప్‌ అయ్యాక ఫ్యాటీలా మారిపోయింది బెల్లీ బ్యూటీ.

ఇలియానా బరువు చూసి వచ్చే ఒకటి రెండు సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఇల్లీ కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరిందనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. ఈ డేంజర్‌ జోన్‌ నుంచి బయటపడ్డానికి బరవుతో పాటు రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటోందట ఇలియానా.

Read more RELATED
Recommended to you

Latest news