అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటాం : ఎమ్మెల్సీ కవిత

-

ఈడీ అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తామని ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, మరియు కవిత కుటుంబ సభ్యులు అని తెలిపారు. ఈడీ అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర సీనియర్ నాయకులు కోరారు.

ఇదిలా ఉంటే… ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన అరెస్ట్ నోటీసులు బయటకు వచ్చాయి. మనీలాండరింగ్ చట్టం 2022(15 of 2003) కింద ఆమెను అరెస్ట్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె మనీలాండరింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్ట్ చేసినట్టు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుపై ఈ నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news