ఏపీలో మద్యపాన నిషేధం చేస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ అది ఒకే సారి సాధ్యం కాదని అర్ధమయ్యి ఐదేళ్లలో విడతలవారీగా మద్యపాన నిషేధం దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లానింగ్‌తో నిబంధనలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక సరిహద్దులో పోలీసులు ఎన్ని విధాలుగా భద్రత ఏర్పాటు చేసినా సరే అక్రమ మద్యం మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఇక రాజకీయ నాయకులు అండ ఉండటంతో ఇప్పుడు భారీగా అక్రమ మద్యం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా నుంచి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. ఇది కట్టడి చేయడం పోలీసులు కూడా పెద్ద సవాల్ గా మారింది.
తాజాగా కృష్ణా జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 40 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే అది మూమూలు వ్యక్తి నుండి కాదు ఏకంగా దుర్గ గుడి కమిటీలో ఒక మెంబర్. ఆమె పేరు చక్కా వెంకట నాగావరలక్ష్మి. ఆమె కారులో మద్యం దొరకడంతో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. అయితే ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులకి దిమ్మతిరిగింది. అదేంటంటే కారు నాదే కానీ కారులో మందు నాది కాదని, అసలు కారులోకి మందు ఎలా వచ్చిందో తనకు తెలియదని ఆమె చెబుతోంది. దీంతో ఏమి చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.