బాబ్రీ మసీదు కూల్చివేతలో నిందితులుగా ఉన్న 32మంది నిందితులని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. 32మందిలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్ మొదలగు వారున్నారు. ప్రస్తుతం వీరందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ విషయమై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ, అందరూ నిర్దోషులే అయితే బాబ్రీ మసీదును కూల్చింది ఎవరంటూ ప్రశ్నించాడు. బాబ్రీ మసీదు కూల్చిందెవరో ప్రపంచానికి తెలుసని, న్యాయవ్యవస్థలో ఇదొక బ్లాక్ డే అంటూ పేర్కొన్నాడు.
ఈ విషయమై సరైన తీర్పు వెలువడలేదని, అందువల్ల ఈ కేసుని ఆల్ ఇండియా ముస్లిం బోర్డ్ ఆఫ్ లా కి అప్పీల్ చేయాలని డిమాండ్ చేసారు. 1992 డిసెంబర్ 6వ తేదీన జరిగిన కూల్చివేతపై తీర్పు ఇచ్చిన కోర్టు, కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదని, క్షణకాలంలో జరిగిపోయిందని తెలిపింది. ఈ కేసులో నిందితులుగా 32మందిలో 26మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడం జరిగింది.